హైదరాబాద్: అమెరికాకు చెందిన కాగ్నిజెంట్(Cognizant) ఐటీ కంపెనీ సుమారు 3500 ఉద్యోగుల్ని తొలగించనున్నది. ఆపరేషన్స్‌పై వత్తిడి తగ్గించేందుకు ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా నాన్ బిల్లింగ్, కార్పొరేట్ రోల్స్‌లో ఉన్నవారిని తొలగించే ప్రక్రియలో కంపెనీ ఉంది. ఖర్చులు నియంత్రించడంలో భాగంగా ఆఫీసు స్పేస్‌ను కూడా తగ్గించుకోనున్నట్లు కంపెనీ చెప్పింది. ఈ ఏడాది ఆదాయం పడిపోనున్నట్లు కంపెనీ వెల్లడించింది.