లండన్, మే 26: బ్రిటన్‌లో సముద్ర తీరానికి రూ.820 కోట్ల విలువైన కొకైన్ మాదకద్రవ్యాలు కొట్టుకువచ్చాయి. రెండు బీచుల్లో 960 కిలోల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. స్మగ్లర్లు కొకైన్‌ను వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో పెట్టి, కవర్లలో చుట్టి వాటికి లైఫ్ బోట్ జాకెట్లను కట్టారు. మొదట హేస్టింగ్స్ అనేప్రాంతంలో స్థానికులు సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన బ్యాగులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోనే మరిన్ని బ్యాగులు దొరికాయి. ఈ కొకైన్ ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందన్నదానిపై సమాచారం లేదు.