సర్కస్‌లో స్టంట్స్ చేయడం అంత ఈజీ కాదు. సర్కస్ చూడటానికి వచ్చే వాళ్లను కనువిందు చేయాలి. వాళ్లు చేసే స్టంట్స్ ఎంత బాగుంటే ప్రేక్షకులు సర్కస్‌ను అంత ఎంజాయ్ చేస్తారు. సర్కస్ అనగానే మనకు గుర్తొచ్చేది.. పైనుంచి ఎగిరి దూకడాలు. సింహాలు, పులులతో ఆటలు. ఏనుగుల మీద కూర్చొని డ్యాన్స్‌లు చేయడం.. ఇలా రకరకాల విన్యాసాలను సర్కస్‌లో చేస్తుంటారు.
తాజాగా జర్మనీలోని డుయిస్బర్గ్లోని ఫ్లిక్ ఫ్లాక్ సర్కస్‌లో భాగంగా ఓ స్టంట్ చేస్తూ లుకాస్ మాలేక్సీ అనే స్టంట్‌మ్యాన్ 20 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడిపోయాడు.
పైనుంచి ఎగురుతూ 20 ఫీట్ల ఎత్తులో ఉన్న ఓ స్టాండ్‌ను పట్టుకోబోయి పట్టు తప్పి స్టంట్‌మ్యాన్ కిందపడిపోయాడు. దాని కిందనే ఉన్న మరో స్టంట్‌మ్యాన్ అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.