బీజింగ్ : ఐన్‌స్టీన్ బ్రైన్ (Einsteins Brain) అంటూ మార్కెటింగ్ గారడీలతో ఓ చైనా వెబ్సైట్ తబావు అనే పేరుతో వర్చువల్ ప్రోడక్ట్‌ను అమ్మకానికి పెట్టింది. ఈ ప్రోడక్ట్‌తో ప్రజలు అత్యంత తెలివైన వారుగా మారతారని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ ప్రోడక్ట్ కొనుగోలు చేసిన వారు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి బ్రైన్‌ను సొంతం చేసుకోవచ్చని చైనీస్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ప్రచారం చేస్తోంది. ఈ వైరల్ ప్రోడక్ట్ మెడిసిన్ లేదా చిప్ రూపంలో కాకుండా వర్చువల్ మోడ్‌లో అందుబాటులో ఉంది.
భారత కరెన్సీ ప్రకారం రూ. 1 నుంచి రూ. 12 మధ్య లభ్యమయ్యే ఈ ప్రోడక్ట్‌ను ఇప్పటికే 20,000 మందికిపైగా కస్టమర్లు కొనుగోలు చేశారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇమేజ్‌తో ఈ ప్రోడక్ట్‌ను విక్రయిస్తున్నారు. మా ప్రోడక్ట్ వర్చువల్..దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు చేయాల్సిందేంటంటే తెలివైన వారుగా మారేందుకు వేచిచూడటమే..ఓ రాత్రి గడిచిన తర్వాత మీ తలలో ఐన్‌స్టీన్ మెదడు పెరుగుతున్నట్టు గుర్తిస్తారని ఈ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొడుతున్నారు.
ఈ ప్రోడక్ట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుండగా యూజర్ల నుంచి కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం గమనార్హం. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత తమ మెదడు సామర్ధ్యం పెరిగిందని కొందరు చెబుతున్నారు. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత తాను హాజరైన ఎగ్జామ్‌లో అన్ని ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేశానని ఓ యూజర్ రాసుకొచ్చారు. అయితే ఈ ప్రోడక్ట్ వృధా అంటూ మరికొందరు యూజర్లు కామెంట్స్ చేశారు.
Read More :
Kamal Hasan 233 | ‘గట్స్ అండ్ గన్స్’.. ఆసక్తి రేకెత్తించేలా కమల్ హాసన్ సినిమా అప్డేట్