Kamal Hasan 233 | తీరన్ అధిగారం ఒండ్రు (తెలుగులో ఖాకి), నేర్కొండ పార్వై, వలిమై (Valimai), తునివు (Thunivu) చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు కోలీవుడ్ దర్శకుడు హెచ్. వినోద్ (H Vinod). ఆయన దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి స్వయంగా కమల్‌హాసన్ కథను అందింస్తుండగా.. రాజ్‌కమల్ ఫిలింస్ ఇండియా (Raaj Kamal Films International) నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. #KH233 వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
భారీ యాక్షన్ నేపథ్యంలో రానున్న ఈ మూవీ కోసం కమల్‌హాసన్ ట్రెయినింగ్ సెషన్లో పాల్గొనుంటున్నట్లు మేకర్స్ ఒక వీడియో విడుదల చేశారు. కమల్ గన్ పట్టుకుని షూట్ చేస్తున్నట్లు వీడియో ఉంది. కాగా ‘గట్స్ అండ్ గన్స్’ (Guts And Guns) పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఇక ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
Guts & Guns 🔥
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023