బీజింగ్: బ్యాగ్‌లో సర్దుకున్న వస్తువుల బరువును తగ్గించే వినూత్నమైన ‘బ్యాక్‌ప్యాక్’ను చైనా పరిశోధకులు తయారుచేశారు. రెగ్యులర్ బ్యాగ్‌లతో పోల్చితే, కొత్త డిజైన్‌తో తయారుచేసిన ఈ బ్యాక్‌ప్యాక్‌లు తేలిగ్గా ఉంటాయని, శ్రమ శక్తిని 11% తగ్గించాయని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాగ్‌ను ధరించటాన్ని సౌకర్యవంతం చేసిందని, ఎక్కువ దూరం బరువులు మోయగలిగేలా సహాయపడిందని ‘నమూనా ప్రయోగం’లో తేలింది.
‘హార్బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ రోబోటిక్స్, సిస్టమ్స్ ల్యాబ్ పరిశోధకుల బృందం తయారుచేసిన ‘సెల్ఫ్ లైటెనింగ్ బ్యాక్‌ప్యాక్’ నమూనా ప్రయోగాల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. బ్యాగ్‌లోని వివిధ రకాల వస్తువులు నిలువుగా కదలటం వల్లే ఆ బ్యాగ్ బరువుగా మారుతున్నదని, దీనిని నివారించిట్టయితే బ్యాగ్ తేలిగ్గా మారుతుందన్న విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు.
వస్తువుల కదలికలను నియంత్రించే ‘మైక్రోకంట్రోలర్ల’ను బ్యాక్‌ప్యాక్‌లో ఏర్పాటుచేస్తూ ఒక కొత్త డిజైన్‌తో కూడిన బ్యాగ్‌ను రూపొందించారు. వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని పరిశోధకులు చెప్పారు.