వాషింగ్టన్: డ్రాగన్ దేశం చైనాకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ దేశం నిర్మిస్తున్న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గామి(Nuclear Submarine).. నీట మునిగింది. ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని అమెరికా రక్షణ అధికారి ఒకరు వెల్లడించారు. సైనిక సామర్థ్యాన్ని విస్తరించాలనుకుంటున్న చైనాకు ఈ సంఘటన తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం చైనా వద్ద సుమారు 370 భారీ నౌకలు ఉన్నాయి. అయితే కొత్త తరహా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్మెరైన్లను తయారు చేస్తున్నది. చైనాకు చెందిన ఫస్ట్ క్లాస్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో నీటిలో మునిగినట్లు అమెరికా రక్షణ అధికారి తెలిపారు. అయితే వాషింట్టన్లో ఉన్న చైనా ఎంబసీ ప్రతినిధి ఈ అంశాన్ని ద్రువీకరించలేదు. తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు.