బీజింగ్: కమర్షియల్ రాకెట్ లిజియన్-1(Lijian-1 Rocket)ను ఇవాళ చైనా ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా అయిదు ఉపగ్రహాలను తీసుకెళ్లారు. నిర్దేశిత కక్ష్యలో ఆ శాటిలైట్లను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. లిజియన్-1 రాకెట్‌ను సీఏఎస్ స్పేస్ అభివృద్ధి చేసింది. ఇవాళ ఉదయం 7.33 నిమిషాలకు ఈ పరీక్ష జరిగింది. జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగం సాగింది. అయిదు ఉపగ్రహాల్లో.. రెండు ఎయిర్‌శాట్ కంపెనీ ఉపగ్రహాలు ఉన్నాయి. జిలిన్-1 ఎస్ఏఆర్01ఏ, యున్యావో-1 శాలిలైట్లను ల్యాండ్ సర్వే, వాతావరణ స్టడీ కోసం వాడనున్నారు. లిజియాన్1 తరహా రాకెట్లను చైనా ప్రయోగించడం ఇది నాలుగవ సారి. 2022 జూలైలో తొలిసారి జలిజియన్ రాకెట్‌ను ప్రయోగించారు. ఇప్పటి వరకు ఆ రాకెట్ల ద్వారా 42 శాలిటైల్లను పంపారు. వాటి ద్వారా 4 టన్నుల బరువైన పేలోడ్స్ కూడా మోసుకెళ్లారు.