మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కోరారు. ఇవాళ ఆయన పుతిన్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను త్యజిస్తే, అప్పుడు ఆ దేశంతో చర్చలకు సిద్ధమని రష్యా వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి లవ్రోవ్ తెలిపారు. వేర్పాటువాదం నుంచి ఉక్రెయిన్‌కు విముక్తి కల్పించాలని ఆయన అన్నారు. గురువారం రష్యా త్రివిధ దళాలు ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. రెండవ రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. తాజా సమాచారం ప్రకారం కీవ్‌లోని ఈశాన్య, తూర్పు ప్రాంతాలను రష్యా సైన్యం ఆధీనంలోకి తీసుకున్నది.