షాంఘైలో తగ్గని కరోనా ఉధృతి.. తొలిసారిగా ఇద్దరు మృతి
Shanghai | ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ షాంఘైలో కరోనా ఉధృతి తగ్గడంలేదు. ఆదివారం ఒకేరోజు 22 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గతకొన్నాళ్లుగా లాక్డౌన్లో మగ్గుతున్న షాంఘైలో తొలిసారిగా వైరస్‌తో ఇద్దరు మృతిచెందారు.
షాంఘై: ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ షాంఘైలో కరోనా ఉధృతి తగ్గడంలేదు. ఆదివారం ఒకేరోజు 22 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గతకొన్నాళ్లుగా లాక్డౌన్లో మగ్గుతున్న షాంఘైలో తొలిసారిగా వైరస్‌తో ఇద్దరు మృతిచెందారు. మృతులిద్దరు 89, 91 ఏండ్ల వయస్కులని, వారు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. కరోనా మలిదశలో చైనాలో కరోనా మరణాలు నమోదవడం ఇది రెండోసారి. గత నెలలో జిలిన్ ప్రావిన్స్‌లో మహమ్మారికి ఇద్దరు బలయ్యారు.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో చైనాలో షాంఘై కరోనాకు కేంద్రంగా మారింది. నగరంలో మార్చి మొదటివారం నుంచి ఇప్పటివరకు 3 లక్షల 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి స్థానిక ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నది. దీంతో 25 మిలియన్లకుపైగా జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ బుధవారం నాటికి వైరస్‌ను నిలువరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో నగరవాసులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

