బీజింగ్ : చైనా చేపడుతున్న భారీ డ్యామ్ నిర్మాణంతో భవిష్యత్తులో భారత్కు ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని చైనా శాస్త్రవేత్తలే చెప్పారు. యార్లుంగ్ సాంగ్పో నదిపై (ఇండియాలో బ్రహ్మపుత్ర నది) ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అయితే ఈ డ్యామ్ నిర్మాణ స్థలం హిమయుగం నుంచి కదులుతున్న ప్రధాన భూకంప రేఖ (భూకంప పగులు) పైనే ఉందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫైజెన్ ఫాల్ట్ అనే భూకంప రేఖ ఈ డ్యామ్ కింద నుంచే వెళ్తోంది.
భూకంపానికి అనువైన చోట అంత పెద్ద డ్యామ్ కడితే భవిష్యత్లో భారీ ప్రమాదాలు జరుగుతాయని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికీ భూకంపాలకు అణువుగా చురుగ్గా ఉంది. 2017లో టిబెట్లో భూంకపాలను ఇందుకు నిదర్శనంగా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ డ్యామ్ కడితే ఒకేసారి భారీగా నీటి విడుదల, ప్రకృతి విపత్తుల లాంటి ప్రమాదాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సంప్రదింపులు జరపాలని భారత్ కోరినా చైనా ముందుకు రావట్లేదు.