బీజింగ్: మయన్మార్‌లోని ఆన్లైన్ స్కామ్ సెంటర్లతో సంబంధం కలిగి ఉన్న 11 మందిని చైనా ఉరి తీసింది. తమ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న మోసాలపై ఈ మేరకు కఠిన చర్యలు తీసుకున్నది. ఇదే కేసులో మరో 23 మంది అనుమానితులకు ఐదేండ్లు మొదలుకొని జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధించింది.
‘ఉద్దేశపూర్వక హత్యలు, గాయపరచడం, చట్టవిరుద్ధ నిర్బంధం, మోసం, జూద గృహాల స్థాపన వంటి నేరాలను పరిగణనలోకి తీసుకొని దోషులకు ఉరి శిక్ష అమలైంది’ అని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.