Robot Boxing | ప్రపంచంలోనే మొదటిసారి.. రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు హ్యూమనాయిడ్(మనుషులను పోలినవి) రోబోల మధ్య బాక్సింగ్ పోటీ జరగబోతున్నది. వచ్చే నెలలో జరగనున్న ఈ బాక్సింగ్ పోటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని చేపడుతున్నట్టు చైనా రోబోటిక్ సంస్థ ‘యునిట్రీ’ తాజాగా వెల్లడించింది.
Robot Boxing | బీజింగ్, ఏప్రిల్ 13: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు హ్యూమనాయిడ్(మనుషులను పోలినవి) రోబోల మధ్య బాక్సింగ్ పోటీ జరగబోతున్నది. వచ్చే నెలలో జరగనున్న ఈ బాక్సింగ్ పోటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని చేపడుతున్నట్టు చైనా రోబోటిక్ సంస్థ ‘యునిట్రీ’ తాజాగా వెల్లడించింది. ఈ పోటీకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియోను కూడా సంస్థ విడుదల చేసింది.
4.3 అడుగుల ఎత్తున్న జీ1 హ్యూమనాయిడ్, 5.11 అడుగుల ఎత్తున్న హెచ్-1 మోడల్ రోబోల మధ్య ఈ బాక్సింగ్ పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. హెచ్1 మోడల్.. యూనిట్రీ ప్రధాన రోబో. అత్యుత్తమ కంప్యూటింగ్ శక్తి, అత్యంత చురుకైన చలన నియంత్రణ దీని సొంతం. ఈ ఏడాది జనవరిలో యూనిట్రీ తన రోబోల అద్భుతమైన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించింది. తాజాగా రోబోల బాక్సింగ్ పోటీలకు సిద్ధమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

