China | త్వరగా పెండ్లి చేసుకుని పిల్లల్ని కనండి.. యువతను వేడుకుంటున్న చైనా
తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నది. దీంతో యువతీ యువకులను త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటున్నది.
- తగ్గుతున్న జనన రేటుపై ఆందోళన
- రిటైర్మెంట్ వయసు పెంచేందుకు ప్రణాళిక
China | బీజింగ్, సెప్టెంబర్ 13: తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నది. దీంతో యువతీ యువకులను త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటున్నది. యుక్త వయసులోనే యువతీ యువకులకు వివాహాలు చేయించేందుకు నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదే సమయంలో జనాభా సంబంధిత సమస్యల నివారణకు పదవీ విరమణ వయసును క్రమంగా పెంచుకుంటూ పోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇటీవల కాలంలో తగ్గుతున్న జనన రేటు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళన పరుస్తున్నది. ప్రస్తుతం చైనాలోని నిబంధనలు ప్రకారం యువకులు 22 ఏండ్లు నిండిన తర్వాత, యువతులు 20 ఏండ్ల తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి. అయితే పిల్లల పెంపకానికి అధిక ఖర్చు కావడం, కెరీర్‌కు సంబంధించిన లక్ష్యాలు, కొన్ని సంప్రదాయ కట్టుబాట్ల కారణంగా చాలామంది మహిళలు పిల్లలను కనడానికి సందేహిస్తున్నారు.
ఈ క్రమంలో త్వరగా పెళ్లి చేసుకుని, తొందరగా పిల్లల్ని కనాలంటూ చైనా నినదించనుంది. అందులో భాగంగానే రిటైర్మెంట్ వయసును కూడా పురుషులకు 60 నుంచి 63కు, మహిళలకు 50 నుంచి 55కు ఆయా ఉద్యోగాలను బట్టి పెంచాలని యోచిస్తున్నది. దీనిని 2025లో ప్రారంభించి 2040కు పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- China NHC
- Population
- womens
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

