చైనా క్రూరత్వంపై ఐక్యరాజ్యసమితి రిపోర్ట్
వాషింగ్టన్: చైనా దారుణమైన రీతిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి తన నివేదికలో ఆరోపించింది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉయిగర్ ముస్లింలపై ఆ దేశం ఊచకోతకు దిగినట్లు యూఎన్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. ఉయిగర్ ముస్లింలతో పాటు ఇతర మైనార్టీలపై డ్రాగన్ హింసకు దిగినట్లు యూఎన్ తెలిపింది. ఆ రిపోర్ట్‌ను చైనా ఖండించింది. పాశ్చాత్య దేశాలు తప్పుడు నివేదికను రూపొందించినట్లు చైనా విమర్శించింది. ఉయిగర్ ముస్లింలను చిత్రహింస పెట్టిన అంశానికి సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలను గుర్తించామని, ఇది మానవత్వానికి జరిగిన హింస అని యూఎన్ తన రిపోర్ట్‌లో చెప్పింది. మైనార్టీల హక్కుల్ని కాలరాసేందుకు జాతీయ భద్రతా చట్టాలను చైనా వాడుకున్నట్లు ఆరోపించింది. యూఎన్‌కు చెందిన మానవ హక్కుల హై కమీషనర్ ఈ నివేదికను తయారు చేశారు. ఖైదీలను చాలా నీచంగా చూశారని, లైంగిక వేధింపులు కూడా జరిగినట్లు యూఎన్ తన రిపోర్ట్‌లో ఆరోపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

