బుధవారం 03 జూన్ 2020
International - Apr 08, 2020 , 10:25:46

వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌

వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌

వుహాన్‌: ప‌్రాణాంత‌క‌ కరోనా వైర‌స్‌ జన్మస్థానమైన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో బుధవారం లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. హుబె ప్రావిన్స్‌ రాజధాని నగరమైన వుహాన్‌లో 76 రోజులపాటు విధించిన నిర్బంధాన్ని తొలగించారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వెలుగు చూడటంతో 11 వారాల క్రితం వుహాన్లో లాక్‌డౌన్‌ విధించారు. గ‌త కొన్ని రోజులుగా కొత్త కేసులు న‌మోదు కాక‌పోవ‌డంతో ఇప్పుడు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీంతో చాలా కాలం త‌ర్వాత వుహాన్‌ ప్రజలకు స్వేచ్ఛ లభించింది. 

ఇక‌, లాక్‌డౌన్‌ తొలగించడంతో వుహాన్‌లో రాకపోకలు మొదలయ్యాయి. దాదాపు 55 వేల మంది బుధవారం రైళ్ల ద్వారా వుహాన్‌ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు బయలు దేరతారని స్థానిక మీడియా తెలిపింది. ఆంక్షలు తొలగిపోవడంతో సాధారణ ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో సందడి నెలకొంది. వుహాన్‌ నుంచి చైనాలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరిన జనంతో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. అయితే పాఠ‌శాల‌పై మాత్రం ఇంకా ఆంక్ష‌లు తొల‌గించ‌లేదు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo