తైపే, అక్టోబర్ 4: స్వయంపాలిత దీవి తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న చైనా తన దూకుడును మరింత పెంచింది. డ్రాగన్ దేశానికి చెం దిన 52 యుద్ధ విమానాలు సోమవారం తమ గగనతలంలో చక్కర్లు కొట్టినట్టు తైవాన్ రక్షణశాఖ తెలిపింది. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొ న్నది. గత శుక్రవారం నుంచి తైవాన్ గగనతలంలోకి వందకు పైగా చైనా యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాంతీయ స్థిరత్వం, ప్రశాంతతకు భంగం కలిగించొద్దంటూ చైనాకు హితవు పలికింది.