China Beauty Influencer | ఈ చైనా బ్యూటీని చూస్తే ఏం క్రేజ్‌రా బాబూ అని అనాల్సిందే..! దాదాపు మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఓ బ్యూటీ మేకప్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ సోషల్‌మీడియాలోని షేక్ చేసేసింది. కొత్త ఖాతా తెరిచానని పోస్టు పెట్టిన 24 గంటల్లోనే దాదాపు కోటి ( 10 మిలియన్) మంది ఫాలోవర్లను సంపాదించి హాట్ టాపిక్‌గా నిలిచింది.
జియాంగ్ చెంగ్లాన్ అనే చైనా యువతి సోషల్‌మీడియాలో ఒకప్పుడు చాలా ఫేమస్. చెంగ్షియన్ అనే పేరుతో ఆమె పెట్టే మేకప్ వీడియోలను అమ్మాయిలు, ఆంటీలు విపరీతంగా చూసేవాళ్లు. తక్కువ ఖర్చులో సింపుల్‌గా మేకప్ వేసుకునే టెక్నిక్స్ చెప్పడంతో ఆమె అప్పుడు పాపులర్ అయ్యింది. ఆ సమయంలో ఆమెకు 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉండేవాళ్లు. కానీ ఏమైందో ఏమో కానీ మూడేళ్ల క్రితం సడెన్‌గా ఆమె సోషల్‌మీడియా నుంచి మాయమైపోయింది. 2023 మే నెల తర్వాత ఒక్క వీడియో కూడా పోస్టు చేయలేదు. దీంతో ఏమైందని ఫ్యాన్స్ కూడా అయోమయంలో పడిపోయారు. కానీ ఆమె నుంచి ఎలాంటి మెసేజ్ లేదు.
అలా మూడేళ్లు గడిచిపోయాక రీసెంట్గా ఆమె తన పేరు(జియాంగ్ చెంగ్లాన్)తోనే సోషల్‌మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. తాను సోషల్‌మీడియాను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఒక వీడియో పెట్టింది. ఇంకేముందు ఆ వీడియో చూడగానే తమ బ్యూటీ క్వీన్ మళ్లీ వచ్చేసిందని ఆమె ఫ్యా్న్స్ ఫాలో కొట్టడం మొదలుపెట్టారు. అలా కేవలం 24 గంటల్లోనే దాదాపు కోటి మంది ఫాలోవర్లను సంపాదించి చైనాలో సంచలనం సృష్టించింది.
ఇక తాను పోస్టు చేసిన వీడియోలో పాత ఖాతాను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో వివరించింది. పాత కంపెనీతో నెలకొన్న వివాదం కారణంగానే అందులో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది చెప్పింది. తన పాత ఆన్లైన్ నేమ్ చెంగ్సియన్ అనేది ఆ కంపెనీ ట్రేడ్‌మార్క్‌గా నమోదైందని తెలిపింది. ఇప్పుడు ఆ పేరుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తనపై ఉన్న నమ్మకంతో ఆ బ్రాండ్ నుంచి ఉత్పత్తులు కొనవద్దని అభిమానులకు సూచించింది. ఇకపై మేకప్ పాఠాలతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటానని తెలిపింది. అన్నట్లుగానే మరుసటి రోజే ఓ మేకప్ వీడియోను జియాంగ్ చెంగ్లాన్ పోస్టు చేసింది. ఆ వీడియోకు 44 లక్షలకుపౌగా లైక్‌లు రావడం గమనార్హం. మరోవైపు జియాంగ్ రీఎంట్రీతో బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీలు కూడా ఆమెతో టైఅప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.