బీజింగ్: చైనా వాతావరణ శాఖ తీవ్ర స్థాయి హెచ్చరిక జారీ చేసింది. టైఫూన్ రాగస దూసుకొస్తున్న నేపథ్యంలో లెవల్ 2 ఎమర్జెన్సీ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఇదే అత్యంత శక్తివంతమైన టైఫూన్ అని ఇప్పటికే చైనా వాతావర్ శాఖ తెలిపింది. ఈ ఏడాది వస్తున్న 18వ టైఫూన్ అని పేర్కొన్నది. రాగసను సూపర్ టైఫూన్గా భావిస్తున్నారు. ప్రస్తుతం పిలిప్పీన్స్ రాజధాని మనీలాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఆ టైఫూన్ కేంద్రీకృతమై ఉన్నట్లు చైనా వెదర్ శాఖ చెప్పింది. బుధవారం నాటికి చైనా తీరాన్ని ఆ టైఫూన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం దక్షిణ చైనా సముద్రంలోకి ఆ టైఫూన్ ప్రవేశించనున్నది. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు గువాంగ్డాంగ్, సెంట్రల్, సదరన్ గాంగ్జీ, సదరన్ ఫుజియన్, సదరన్ హునాన్, ఈస్ట్రన్ యునాన్, హైనన్ దీవిలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సు ఉంది.