గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 14:57:48

బీచ్‌లో ఈత కొడుతూ మిస్ అయ్యాడు.. చిన్న రంధ్రంలో బాలుడి చేయి!

బీచ్‌లో ఈత కొడుతూ మిస్ అయ్యాడు.. చిన్న రంధ్రంలో బాలుడి చేయి!

కొన్ని ఘ‌న‌ట‌న‌లు చాలా అరుదుగా జ‌రుగుతాయి. ఒక బాలుడు త‌న తాత‌లో క‌లిసి బీచ్‌లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఇద్దురూ ఈత కొడుతుండ‌గా బాలుడు మిస్ అయ్యాడు. చుట్టుప‌క్క‌ల గాలించినా ఆచూకి లేదు. దీంతో తాత చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌కు వెళ్లి బాలుడి మిస్సింగ్ గురించి చెప్పారు. దీంతో వారంతా వ‌చ్చి బీచ్‌లో బాబుని వెత‌కసాగారు. ఇంత‌లో ఒక రంధ్రంలో బాలుడి చేయి క‌నిపించింది. కాపాడంటూ అరుపులు వినిపిస్తున్నాయి. చేయి ప‌ట్టేంత రంధ్రంలోకి అత‌ను ఎలా ప‌ట్టాడు అని అక్క‌డి వాళ్లెవ‌రికీ అర్థం కాలేదు. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందివ్వ‌గా వ‌చ్చి బాలుడిని ప్రాణాల‌తో ర‌క్షించారు.

అస‌లు న‌దీతీరంలో ఈ రంధ్రం ఎలా వ‌చ్చింద‌ని ఆరా తీయ‌గా  అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. నదీ తీరంలో ఉన్న నేల సాధారణమైనది కాదు. అది గుహ పై భాగం. ఈ గుహ‌కు వెళ్లాలంటే న‌ది నుంచి మార్గం ఉంది. ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. బాలుడు ఈత కొడుతున్న‌ప్పుడు సుడిలో ఇరుక్కుపోయాడు. నీటి ప్ర‌వాహం ఎక్కువ ఉండ‌డంతో అత‌డిని గుహ‌లోకి నెట్టేసింది. గుహ‌లో ప్ర‌దేశం ఎక్కువ‌గా ఉండ‌డంతో కాసేపు అక్క‌డే ఈత కొట్టాడు. చీక‌టిగా ఉండ‌డంతో బాలుడు భ‌యంతో గ‌జ‌గ‌జావ‌ణికి పోయాడు. దీంతో కాపాడంటూ అరిచాడు. ఈ సంఘ‌ట‌న చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ యోంగ్జియా కౌంటీలో చోటుచేసుకుంది. 

 


logo