ప్రస్తుతం టిక్‌టాక్‌లో ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేంటో తెలుసా? నైక్విల్ చికెన్.. లేదా స్లీపీ చికెన్. అంటే ఏంటో తెలుసా? దగ్గు సిరప్‌తో చికెన్ వండటం అన్నమాట. అదేంటి.. దగ్గు సిరప్‌తో చికెన్ వండటం అంటారా? అదే ఇప్పుడు యూఎస్‌లో ట్రెండింగ్‌లో ఉంది. యూఎస్‌లో నైక్విల్ అనేది దగ్గు సిరప్. దాన్ని దగ్గుకు మందుగా వాడుతారు. ఆ మందుతో చికెన్‌ను వండుతున్నారు. ఈ ట్రెండ్‌ను చూసి యూఎస్ డాక్టర్లు టెన్షన్ పడుతున్నారు.
ఎందుకంటే.. దగ్గు సిరప్‌ను వేడి చేస్తే అది విషయంలా మారుతుంది. అందులోనూ దాన్ని చికెన్‌లో వేసి వండటం అంటే అది ఇంకా డేంజర్ అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. టిక్‌టాక్‌లో ఈ దగ్గుమందుతో వండుతున్న చికెన్ వంటకాల వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అలాంటి చికెన్‌ను తింటే.. ఒకేసారి సగం బాటిల్ దగ్గు మందు తాగినట్టేనని.. దాని వల్ల లివర్ చెడిపోతుందని.. వామిటింగ్ కూడా అవుతుందని.. ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా ఈ ట్రెండ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ట్రెండ్‌ను వెంటనే ఆపేయాలని టిక్‌టాక్‌ను నెటిజన్లు కోరుతున్నా.. కొందరు యూజర్లు మాత్రం అత్యుత్సాహంతో టిక్‌టాక్‌లో వీడియోలు చూసి దగ్గు మందుతో చికెన్ తయారు చేస్తున్నారు.