ChatGPT | ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ గురించి చాట్‌జీపీటీ ఏం చెప్పిందో తెలుసా..?
ChatGPT | ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురించి చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానమిచ్చింది. వారిని వివాదాస్పద (controversial) వ్యక్తులుగా పేర్కొంది. అంతే కాదు వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని (special manner) కూడా చెప్పింది. వీరితోపాటు మరికొంతమందిని చాట్ జీపీటీ వివాదాస్పద వ్యక్తులుగా పరిగణించింది.
ChatGPT | సాంకేతిక ప్రపంచంలోకి వచ్చీ రాగానే సంచలనాలు సృష్టిస్తోంది ‘చాట్ జీపీటీ’ (ChatGPT). ఇది ఓ కొత్తతరం సెర్చ్ ఇంజిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ టూల్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టూల్‌తో మాట్లాడేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తమకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చాట్ జీపీటీ (ChatGPT)ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఐజాక్ లాటెరెల్ (Isaac Latterell) అనే వ్యక్తి ఎలాన్ మస్క్ ( Elon Musk ) గురించి చాట్ జీపీటీని అడిగి తెలుసుకున్నారు. మరి అతని గురించి ఆ టూల్ ఏం చెప్పిందో తెలుసా.
ఐజాక్ ఒక్క ఎలాన్ మస్క్ గురించే కాదు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson), రష్యా అధ్యక్షుడు వాల్దిమిర్ పుతిన్ (Vladimir Putin), కిమ్ కర్దాషియన్ (Kim Kardashian)లాంటి వ్యక్తులు గురించి అడిగారు. వీళ్ళందరి గురించి చాట్ జీపీటీ ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. వీళ్ళందరూ వివాదాస్పద (controversial) వ్యక్తులుగా పేర్కొంది. అంతే కాదు వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని (special manner) కూడా చెప్పింది.
వీళ్లే కాదు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping), ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un), భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తదితరులను వివాదాస్పద వ్యక్తులుగా పరిగణించింది. న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిందా ఆర్డెమ్ (Jacinda Ardern), బిల్గ్సేట్ (Bill Gates), జర్మన్ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్ (Angela Merkel), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్ (emmanuel macron), కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ను నాన్-కాంట్రవర్షియల్ (non-controversial) వ్యక్తులుగా పేర్కొంది.
ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను ఐజాక్ లాటెరెల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘ప్రత్యేకంగా పరిగణించేందుకు మస్క్, ట్రంప్ అర్హులు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం కాదు’ అంటూ రాసుకొచ్చారు. కాగా, ఐజాక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన చాట్ జీపీటీ సమాధానాలకు ఎలాన్ మస్క్ స్పందించారు. ఐజాక్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. రెండు ఆశ్చర్యార్థకాలను ఉంచారు (!!). ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
ChatGPT lists Trump, Elon Musk as controversial and worthy of special treatment, Biden and Bezos as not. I've got more examples. @elonmusk pic.twitter.com/92bNDQo4qY
— Isaac (@IsaacLatterell) February 19, 2023
— Elon Musk (@elonmusk) February 19, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

