పిల్లులు చాలా ఉల్లాసంగా ఉండే పెంపుడు జంతువులు. రోజంతా వాటి దినచర్యను గమనిస్తుంటే భలే ఫన్నీగా ఉంటుంది. యజమానులతో కలిసి సరదాగా గడుపుతుంటాయి. వారితో కలిసి టీవీ కూడా చూస్తుంటాయి. కాగా, టీవీలో రాబందును చూసి భయపడి పారిపోయిన ఓ పిల్లి వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను బిటెంగెబిడెన్ అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పెంపుడు పిల్లి సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది. టీవీలో రాబందు తనవైపే వస్తుందనుకుని భయపడ్డ పిల్లి అక్కడినుంచి పారిపోయింది. ఈ వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పించింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 5లక్షల 74వేల మంది వీక్షించారు. 32వేల లైక్స్ వచ్చాయి.
What the.. 😂 pic.twitter.com/3Z5pp6FjO0
— Buitengebieden (@buitengebieden) May 20, 2022