Maldives | మాల్దీవుల (Maldives) వివాదం వేళ ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయంలో కేంద్రం కోత విధించిన విషయం తెలిసిందే. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో మాల్దీవులకు పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) అండగా నిలిచింది. మాల్దీవుల అభివృద్ధికి సాయం చేస్తామంటూ ముందుకు వచ్చింది.
పాక్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కకర్ ( Anwaar-ul Haq Kakar) గురువారం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో (Mohamed Muizzu) ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాల్దీవుల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. అంతేకాకుండా పర్యావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి సహకరిస్తామని చెప్పారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్ను పాకిస్థాన్.. ఇప్పుడు మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.
తీవ్ర కష్టాల్లో ఉన్న పాక్ ఇటీవలే 2 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని చైనాను కోరిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో పాక్ నిర్ణయంతో కొన్ని దేశాలు విస్తుపోతున్నాయి. దివాలా అంచున ఉన్న పాక్.. మాల్దీవులకు ఆర్థిక సాయం ప్రకటించడం ఏంటి అంటూ చర్చించుకుంటున్నాయి.
Also Read..
Elephant | బందీపూర్ నేషనల్ పార్క్లో టూరిస్ట్లను వెంబడించిన ఏనుగు.. VIDEO
Arvind Kejriwal | ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఐదో సారీ డుమ్మా
Ambajipeta Marriage Band | సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు వచ్చే పాపులర్ ఓటీటీ ప్లాట్ఫాం ఇదే..!