Watch: ఎండకు తాళలేక… రోడ్డుపై కుప్పకూలిన గుర్రం
వాషింగ్టన్: ఎండకు తాళలేక బండిని లాగుతున్న గుర్రం రోడ్డుపై కుప్పకూలింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. మాన్‌హట్టన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలోని కూడలి వద్ద క్యారేజ్ లాగుతున్న రైడర్ అనే గుర్రం ఉన్నట్టుండి కూలిపోయింది. దానిని పైకి లేపేందుకు గుర్రం బండి వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు అక్కడున్న వారు గుర్రం కింద పడిపోవడం చూసి ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన అశ్వ దళం యూనిట్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక రోడ్డుపై పడిపోయిన ఆ గుర్రానికి సపర్యలు చేశారు. పైపులతో నీటిని దానిపై వెదజల్లారు. ఆ గుర్రం శరీరాన్ని చల్లబరిచారు. దీంతో గంట తర్వాత ఆ గుర్రం తేరుకుని పైకి లేచింది. పోలీసులు దానిని గుర్రపు శాలకు తరలించారు. పశు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జంతు ప్రేమికులు గుర్రం బండి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నగరాల్లో గుర్రం బండ్ల స్వారీని వ్యతిరేకించారు. కార్లు, మనుషులు, వాతావరణంతోపాటు మరెన్నో కారణాల వల్ల గుర్రాలు ప్రమాదానికి గురవుతాయని పెటా సంస్థ ట్విట్టర్లో ఆందోళన వ్యక్తం చేసింది. గుర్రం బండ్ల నిషేధంపై రాజకీయ నేతలు చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే గుర్రం బండ్ల యూనియన్ నేతలు ఈ డిమాండ్లను ఖండించారు.
BREAKING: This horse COLLAPSED while pulling a carriage in NYC, likely from heat exhaustion, and has been down for over an hour.
Horses don’t belong in big cities where they’re put in constant danger because of cars, humans, weather, and more. pic.twitter.com/vXBVRJRjPB— PETA (@peta) August 10, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

