Canada | టొరంటో, నవంబర్ 7: కెనడాలో నిర్వహించాలనుకున్న కాన్సులర్ శిబిరాలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. శిబిర నిర్వాహకులకు కనీస భద్రత, రక్షణ కల్పించలేమని కెనడా అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడంతో వీటిని రద్దు చేసినట్టు చెప్పారు.
ఈ నెల 3న బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయం, భారత కాన్సులేట్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి కొందరు ఖలీస్థానీ నిరసనకారులు హింసాత్మక చర్యలతో అంతరాయం కలిగించిన క్రమంలో కెనడా అధికారులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, ఖలిస్థానీల నిరసనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. భారత్ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది.