వెనిస్: ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్ బోట్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై ఆధారపడ్డ అనేక కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ ప్రాంతం నుంచి పలు ద్వీపాలకు జల మార్గమే ప్రధాన రవాణా సౌకర్యం కావడంతో ఆయా ద్వీపాల ప్రజల రాపోకలకు సైతం ఎంతో కష్టంగా మారింది. తక్కువ సముద్ర నీటి ప్రవాహం, వర్షాభావ పరిస్థితులే కారణమని నిపుణులు పేర్కొన్నారు.