Canada | విదేశీ విద్యార్థులకు కెనడా షాక్.. స్టూడెంట్ వీసా నిబంధనలు మరింత కఠినం
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు తమ ఆర్థిక సంసిద్ధతను పెంచుకొనేలా డిపాజిట్‌ను పెంచుతున్నట్టు ప్రకటించింది.
- డిపాజిట్ రెట్టింపు చేస్తూ నిర్ణయం
Canada | ఒట్టావా, డిసెంబర్ 8: ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు తమ ఆర్థిక సంసిద్ధతను పెంచుకొనేలా డిపాజిట్‌ను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 10 వేల డాలర్లు ఉండగా, 20,635 డాలర్లకు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
‘కెనడాలో జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నాం. విద్యార్థుల వసతి కల్పనకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నాం. తమ నిర్ణయం ఆర్థిక బలహీనత, దోపిడీ నుంచి విద్యార్థులను రక్షిస్తుంది’ అని కెనడా విదేశాంగ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. అదేవిధంగా అంతర్జాతీయ విద్యార్థులకు క్యాంపస్ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపును వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం విదేశీ విద్యార్థులకు కెనడాలో వారానికి 20 కంటే ఎక్కువ గంటల పాటు పని చేసుకొనేందుకు వీలున్నది. కెనడాలో విద్యను అభ్యసించాలనుకొనే విద్యార్థులు స్టూడెంట్ డిపాజిట్ కింద ప్రస్తుతం 10 వేల డాలర్లు చెల్లిస్తున్నారు. ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

