ఒట్టావా, ఫిబ్రవరి 19: వారం కిందటి నీళ్లు తాగాలంటేనే.. అవి పాడైపోయి ఉంటాయని చెప్తుం టాం. అలాంటిది 260 కోట్ల ఏండ్ల నాటి నీళ్లు తాగారు శాస్త్రవేత్తలు. ఓ రిసెర్చ్‌లో భాగంగా కెనడా శాస్త్రవేత్తలు ఒంటారియోలో 1.5 మైళ్ల లోతులో నీళ్లను గుర్తించారు.
ఆ నీరు ఎలా ఉందో రుచి చూద్దామని చూసిన ఓ శాస్త్రవేత్త.. ఇప్పటి వరకు ఎప్పుడూ తాగనంత ఉప్పగా, జిగటుగా ఉన్నదని తెలిపారు. భూమి లోపల రాయికి, నీటికి మధ్య జరిగిన చర్య వల్ల ఇలా ఉప్పగా మారి ఉండవచ్చని వెల్లడించారు. తొలుత నీళ్లను కనుగొన్నపుడు ఎలాంటి రంగు లేదని, ఆక్సిజన్ తాకిడికి నారింజ రంగులోకి మారినట్టు వివరించారు.