విద్యార్థి పర్మిట్లను 10% తగ్గించిన కెనడా
కెనడా వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే పర్మిట్ల సంఖ్యను తగ్గించనుంది. గృహ, ఆరోగ్యం, ఇతర సేవలు అందించడంలో పాలకులు రాజకీయంగా, ప్రజా బాహుళ్యం నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో దాని నుంచి బయటపడటానికి ఈ చర్య చేపట్టినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.
- వరుసగా రెండో ఏడాదీ కోత
ఒట్టావా, జనవరి 25: కెనడా వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే పర్మిట్ల సంఖ్యను తగ్గించనుంది. గృహ, ఆరోగ్యం, ఇతర సేవలు అందించడంలో పాలకులు రాజకీయంగా, ప్రజా బాహుళ్యం నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో దాని నుంచి బయటపడటానికి ఈ చర్య చేపట్టినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఈ ఏడాది 4,37,000 అంతర్జాతీయ విద్యార్థి పర్మిట్లను జారీ చేయాలని ఆ దేశ వలస శాఖ శుక్రవారం నిర్ణయించింది.
2024తో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ. జనాభా సంఖ్య పెరిగిపోవడంతో కెనడాలో ఇండ్ల లభ్యత సమస్య తీవ్రమైంది. 2023లో ఆ దేశం పరిమితికి మించి 6,50,000 విద్యార్థి పర్మిట్లను జారీ చేసింది. దీంతో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలపై ప్రభావం పడి, దేశ ప్రజల నుంచి ప్రతికూలత రావడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో విద్యార్థుల పర్మిట్ల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. విద్యార్థుల పర్మిట్ల జారీకి సంబంధించి నిబంధనలను కూడా కఠినతరం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

