ఒట్టావా: కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థుల జీవన వ్యయ నిధులను అక్కడి ప్రభుత్వం పెంచింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. కెనడా వలస, శరణార్థులు, పౌరసత్వ సంస్థ (ఐఆర్సీసీ) తెలిపిన వివరాల ప్రకారం… విద్యార్థులు ఒక సంవత్సరానికి తమకు అయ్యే జీవన వ్యయం కోసం తమ వద్ద రూ.16 లక్షలు (23,448 కెనడా డాలర్లు) కలిగి ఉండాలి. ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తూ కెనడాలో చదువుకోవాలనుకొనేవారు 19 లక్షల నిధులు కలిగి ఉండాలి.