ఖలిస్థాన్ తీవ్రవాదులతో జాతీయ భద్రతకు ముప్పు
ఖలిస్థాన్ వేర్పాటువాదుల విషయంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రకటించింది. తమ హింసాత్మక తీవ్రవాద ఎజెండాను కెనడాలో ప్రచారం చేయడానికి వేర్పాటువాదుల బృందం వివిధ సంస్థలను వాడుకుంటున్నదని పేర్కొన్నది.
- కెనడా నిఘా ఏజెన్సీ నివేదిక
ఒట్టావా, మే 3: ఖలిస్థాన్ వేర్పాటువాదుల విషయంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రకటించింది. తమ హింసాత్మక తీవ్రవాద ఎజెండాను కెనడాలో ప్రచారం చేయడానికి వేర్పాటువాదుల బృందం వివిధ సంస్థలను వాడుకుంటున్నదని పేర్కొన్నది. ఆదివారం ఈ మేరకు ‘2025 పబ్లిక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. కెనడా కేంద్రంగా ఖలిస్థాన్ వేర్పాటువాదుల (సీబీకేఈ) హింసాత్మక కార్యకలాపాలు ఈ దేశానికి, కెనడా ప్రయోజనాలకు ముప్పుగా నివేదిక పేర్కొన్నది.
‘కెనడా పౌరులతో సంబంధాలు కొనసాగిస్తున్న సీబీకేఈ.. తీవ్రవాద ఎజెండా ప్రచారానికి వారిని ఉపయోగించుకుంటున్నది. అమాయక పౌరుల నుంచి నిధులు సేకరించి, వాటిని హింసాత్మక కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నది’ అని నివేదిక తెలిపింది. నివేదికను కెనడా ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జస్టిన్ ట్రూడో తర్వాత కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

