కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వైరస్ మంకీపాక్స్. ఇది ఒక వైరల్ డిసీజ్. ఇది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అలాగే, మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. తుంపర్లు, సంపర్కం, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, తాజా అధ్యయనంలో ఈ వ్యాధికి సంబంధించిన మరో ఆశ్చర్యకర విషయం వెల్లడైంది. మంకీపాక్స్ అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ (ఎస్టీడీ) అని తేలింది. 95% కేసులు లైంగిక కార్యకలాపాల ద్వారా సంక్రమించాయని పరిశోధకులు గుర్తించారు.
మంకీపాక్స్ కేసుల్లో 95 శాతం లైంగిక సాన్నిహిత్యం వల్లే ఎక్కువగా వ్యాపించినట్లు 16 దేశాలకు చెందిన గ్లోబల్ కేస్ స్టడీ సిరీస్ వెల్లడించింది. అయితే, వైరస్ అనేది ఏదైనా దగ్గరి శారీరక సంబంధం ద్వారా అంటే పెద్ద శ్వాసకోశ బిందువుల ద్వారా, దుస్తులు, ఇతర ఉపరితలాల ద్వారా వ్యాపించి ఉండొచ్చని లండన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనంలో ఏప్రిల్ 27- జూన్ 24, 2022 మధ్య 16 దేశాల్లోని 43 సైట్లలో 528 ఇన్ఫెక్షన్లను పరిశీలించారు. ఈ అధ్యయన ఫలితాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (ఎన్ఈజేఎం)లో ప్రచురితమయ్యాయి. కాగా, ఇందులో 95 శాతం మంది వ్యక్తులు దద్దుర్లు (64 శాతం మంది 10 కంటే తక్కువ 10 గాయాలు కలిగి ఉన్నారు), 73 శాతం మందికి అనోజెనిటల్ గాయాలు, 41 శాతం మంది శ్లేష్మ గాయాల (54 మంది ఒకే జననేంద్రియ గాయంతో ఉన్నారు)తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
అధ్యయనం ఫలితాలు..