లండన్: రోజూ కాఫీతాగే అలవాటుందా? అయితే, మీకు ఇది శుభవార్తే. రోజూ కాఫీ తాగేవారికి గుండె సంబంధిత వ్యాధులతోపాటు డయాబెటిస్, పార్కిన్సన్స్ వ్యాధి ముప్పు తగ్గుతుందని, తద్వారా ఎక్కువకాలం జీవిస్తారని ఓ అధ్యయనంలో తేలింది. కాఫీలో ఉండే కెఫిన్ కాకుండా ఇతర పదార్థాల వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నట్టు పరిశోధకులు తేల్చా రు. 3 లక్షల మంది నర్సులు, హెల్త్ ప్రొఫెషనల్స్‌పై 30ఏండ్లపాటు అధ్యయనం నిర్వహించి, ఈవిషయాన్ని కనుగొన్నారు. కాఫీలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇన్సులిన్ నియంత్రణతో పాటు దీర్ఘకాలిక రుగ్మతలను తగ్గించడంలో తోడ్పడుతున్నాయని గుర్తించారు.