e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News బ్రిటీష్ వేరియంట్ అంత ప్ర‌మాద‌క‌రం కాదు..

బ్రిటీష్ వేరియంట్ అంత ప్ర‌మాద‌క‌రం కాదు..

బ్రిటీష్ వేరియంట్ అంత ప్ర‌మాద‌క‌రం కాదు..

లండ‌న్‌: చాలా విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందుతున్న కరోనా బ్రిట‌న్ వేరియంట్ అనుకున్నంత ప్ర‌మాద‌క‌రం ఏమీ కాదు అని తేలింది. మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ద లాన్‌సెట్ ఆ వేరియంట్‌కు చెందిన అధ్య‌య‌న నివేదిక‌ను రిలీజ్ చేసింది. హాస్పిట‌ల్‌కు గురైన రోగుల్లో బ్రిటీష్ వేరియంట్ పెద్ద‌గా సీరియ‌స్ వ్యాధిని క‌లిగించ‌ద‌ని లాన్‌సెట్ చెప్పింది. బ్రిట‌న్ స్ట్రెయిన్‌ను B.1.1.7 గా పిలుస్తున్నారు. దీన్ని గ‌త ఏడాది గుర్తించారు. అమెరికాలో ఈ స్ట్రెయిన్ వైర‌స్ అత్యంత కామ‌న్ గా క‌నిపిస్తోంది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో బ్రిట‌న్ హాస్పిట‌ళ్ల‌లో చేరిన సుమారు 496 మంది కోవిడ్ రోగుల‌ను అధ్య‌య‌నం చేశారు. బీ.1.1.7తో పాటు ఇత‌ర స్ట్రెయిన్లు సోకిన వారిని ప‌రీక్షించారు. అయితే బీ.1.1.7 వేరియంట్ క‌రోనా సోకిన‌వారిలో తీవ్ర‌త‌ర‌మైన వ్యాధి కానీ, మ‌ర‌ణం కానీ ఉండ‌ద‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు. ఇర‌త ర‌కాల క‌రోనా ఉన్న‌వారిలోనూ.. బ్రిటన్ వేరియంట్ ఉన్నావారిలోనూ.. పెద్ద‌గా తేడాలేద‌న్నారు. తాము సేక‌రించిన డేటా ఈ వాస్త‌వాల‌ను వెల్ల‌డిస్తున్న‌ట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు. కోవిడ్ టీకాలు యూకే వేరియంట్‌పై ప‌నిచేస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. బ్రిటీష్ వేరియంట్ వైర‌స్.. ఇత‌ర వేరియంట్ల‌తో పోలిస్తే, సుమారు 40 నుంచి 70 శాతం వ‌ర‌కు వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. బీ.1.1.7 వ్యాప్తి వేగంగా ఉన్నా.. దాని దుష్ ప్ర‌భావం అనుకున్నంత తీవ్రంగా లేద‌న్నారు.

Advertisement
బ్రిటీష్ వేరియంట్ అంత ప్ర‌మాద‌క‌రం కాదు..
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement