లండన్: జలియన్‌వాలా బాగ్ ఘోర నరమేధంపై క్షమాపణ చెప్పాలనే డిమాండ్ బ్రిటన్ పార్లమెంటులో మారుమోగింది. బ్రిటిష్ కన్జర్వేటివ్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఇటీవల పార్లమెంటు కామన్స్ సభలో మాట్లాడుతూ, 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన దారుణ నరమేధాన్ని ధ్రువీకరించి, భారత దేశానికి క్షమాపణ చెప్పాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సామూహిక హత్యాకాండ జరిగిన రోజు బ్రిటిష్ చరిత్రలో మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. ఈ నరమేధాన్ని చీకటి అధ్యాయంగా 2019లో అప్పటి బ్రిటన్ ప్రధాని థెరిసా మే గుర్తించారని, క్షమాపణ చెప్తూ అధికారిక ప్రకటన మాత్రం జారీ చేయలేదని అన్నారు.