కరాచీ, డిసెంబర్ 26 : జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ గుండెపోటుకు గురయ్యారు. అఫ్గాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లో ఉన్న అతడిని వెంటనే చికిత్స కోసం పాకిస్థాన్‌కు తరలించారు. కరాచీలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా డు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంట్ అప్డేట్ విడుదల చేయలేదు. మసూద్ అజర్ భారత్‌లో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. 1999లో ఉగ్రవాదులు ఐసీ-1814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి భారత జైలులో ఉన్న అతడిని విడిపించుకున్నారు. అనంతరం జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు. 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019లో పల్వామా దాడికి మసూదే ప్రధాన సూత్రధారి. 2019లోనే భారత్ ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.