Larissa Borges | బ్రెజిల్‌కు చెందిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ లారిస్సా బోర్జెస్(33) కన్నుమూసింది. కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబీకులు సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. గతవారం రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో పోరాడుతూ వచ్చిన లారిస్సా మృతి చెందింది. బోర్జెస్ మరణం తమ హృదయాలను ముక్కలు చేసిందని.. మాటలకందని దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటూ కుటుంబీకులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
సమాచారం మేరకు.. బ్రెజిల్ ఫెడరల్ జిల్లాకు చెందిన బోర్జెస్ ఈ నెల 20న గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లగా.. రెండోసారి కార్డియాక్ అరెస్ట్‌కు గురికాగా.. కొద్ది నిమిషాల్లోనే కన్నుమూసింది. 20న లారిస్సా కారులో గ్రామాడోలో ప్రయాణిస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. ఆ సమయంలో ఆమె నిద్రమత్తులో ఉన్నది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రెండోసారి కార్డియాక్ అరెస్ట్ కావడంతో తుదిశ్వాస విడిచింది.