లండన్, జూన్ 26: గర్భస్రావమైన మహిళలకు గుండె సమస్యలతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. గర్భస్రావంతో ధమనులు దెబ్బతినడం, బ్లాక్ కావడం జరుగుతుందని, దీని వల్ల మెదడుకు రక్తం చేరదని, ఫలితంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువని తెలిపింది.
అలాగే గుండెపోటు వచ్చే సమస్యలు కూడా ఎక్కువేనని వెల్లడించింది. 6,18,851 మందిని 11 ఏండ్ల పాటు పరీక్షించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. గర్భస్రావానికి, స్ట్రోక్‌కు లింక్ ఉందని తెలిపే మొదటి అధ్యయనమిదే.