Legal Notice | పాక్‌లోని లాహోర్‌కు చెందిన షాజాహాన్ అనే యువకుడు కరాచీ వెళ్లేందుకు విమానంలో బయాలుదేరాడు. పొరపాటున సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. ఎయిర్‌లైన్స్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే తాను జెడ్డా నగరానికి చేరుకోవాల్సి వచ్చిందని ఆరోపించాడు. టికెట్ చెక్ చేసిన సమయంలో ఎయిర్ హోస్టెస్ తనను మరో విమానం ఎక్కే సమయంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకోలేదని ఆరోపించాడు. డొమెస్టిక్ టెర్మినల్ వద్ద రెండు విమానాలు నిలిచి ఉన్నాయని.. తాను ఓ విమానానికి బదులుగా మరో విమానం ఎక్కినట్లు పేర్కొన్నారు. దాదాపు రెండుగంటల తర్వాత విమానం కరాచీకి చేరుకోకపోవడంతో సదరు ప్రయాణికుడు తన తప్పును తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో సిబ్బంది తనను నిందించారని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. తనకు పాస్‌పోర్ట్ లేదని, వీసా లేకుండానే తాను సౌదీకి చేరానని చెప్పుకొచ్చాడు.
ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం కారణంగా సౌదీలో తాను అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఆ దేశంలో ఎఫ్ఐఏ అధికారులు తనను విచారించారని.. తాను తిరిగి కరాచీకి చేరుకునేందుకు మూడురోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో షాజాహాన్ ఎయిర్లైర్స్కు లీగల్ నోటీసు పంపాడు. ఎయిర్‌లైన్ తప్పు కారణంగా తనకు మానసికంగా, ఆర్థికంగా నష్టం జరిగిందని తెలిపాడు. అదనపు ప్రయాణఖర్చులు, అసౌకర్యానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. లాహోర్ విమానాశ్రయం, పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించారు. చెకింగ్, బోర్డింగ్ ప్రక్రియలో ఎయిర్‌లైన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన ఒక వ్యక్తి ఇబ్బందులు పడడమే కాకుండా పాక్‌లో విమాన ప్రయాణ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పాస్‌పోర్ట్, వీసా లేకుండా విదేశాలకు ఓ ప్రయాణికుడు చేరుకోవడం ప్రత్యక్షంగా నిబంధనలు ఉల్లంఘించడమే. అయితే, ఇప్పటి వరకు ఎయిర్‌లైన్స్ స్పందించలేదు.