మనీలా: పిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు, నియంత మార్కోస్ కుమారుడు ఫెర్డినాండ్ బాంగ్‌బాంగ్ మార్కోస్ జూనియర్ తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా దూసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మార్కోస్ జూనియర్‌కు అనుకూలంగా 55.8 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక 28 శాతం ఓట్లు ప్రత్యర్థి లెని రోబ్రిడోకు పోలైనట్లు తెలుస్తోంది. దాదాపు 36 ఏళ్ల తర్వాత మళ్లీ పిలిప్పీన్స్‌లో మార్కోస్ కుటుంబ పాలన సాగనున్నది. మార్కోస్ సీనియర్ పాలన సమయంలో పిలిప్పీన్స్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వ నిధుల నుంచి సుమారు 8 బిలియన్ల డాలర్లు కాజేసినట్లు సీనియర్ మార్కోస్ ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు జూనియర్ మార్కోస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టిపై మార్కోస్ జూనియర్ గెలవనున్నారు.