చిలుకలు మనుషుల్లాగా మాట్లాడుతుంటాయి. ముద్దు ముద్దుగా పదాలను పలుకుతుంటాయి. అవి అందమైన, మేధోపరమైన పక్షులు. అందుకే వాటిని పెంచుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. యూఎస్‌లో చాలా మంది ఇళ్లలో నీలిరంగులో మెరిసిపోయే ఇండియన్ రింగ్నెక్ చిలుకలుంటాయి. ఈ జాతికి చెందిన ఓ చిలుక తన యజమానితో మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాలో పెట్స్.హాల్ అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోలో చిలుక తన యజమానిని ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్’ అని చెప్పింది. యజమాని కూడా చిలుకను ‘అందంగా ఉన్నావ్’ అని పొగిడింది. దీంతో చిలుక యజమానికి ముద్దులు పెట్టింది. చివర్లో చిలుక.. యజమానికి థ్యాంక్యూ కూడా చెప్పింది. ఈ వీడియో ఇప్పటివరకూ 121 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్నది. 9.7 మిలియన్ లైక్స్‌తో ఆన్లైన్లో చక్కర్లుకొడుతున్నది.