ఈక్వెడార్, జూన్ 16: వేల అడుగుల ఎత్తున విమానం విండ్ షీల్డ్‌ను బద్దలు కొట్టుకుని ఒక భారీ పక్షి కాక్‌పిట్‌లోకి వస్తే పైలట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈక్వెడార్‌లోని లాస్ రాస్ ప్రావిన్స్‌లోని విన్సెస్లో స్కాడ్రన్ లీడర్ ఏరియల్ వ్లైంటీ అనే పైలట్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. ఒక భారీ పక్షి విండ్‌షీల్డ్‌ను బద్దలు కొట్టుకుని కాక్‌పిట్‌లోకి వచ్చి వెంటనే చనిపోయింది. పక్షికి చెందిన రక్తం పైలట్ మొఖం, కాళ్లపై పడింది. పక్షి వల్ల పైలట్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయినా ఈ హఠాత్ పరిణామంతో తొలుత షాక్ తిన్నప్పటికీ తర్వాత తేరుకున్న కెప్టెన్ వ్లైంటీ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. సుమారు 10 అడుగుల విశాలమైన రెక్కలతో భారీగా ఉన్న ఈ పక్షి ఏ జాతికి చెందినదో ఇంకా నిర్ధారణ కాలేదు.