సిడ్నీ : భారత సంతతి బీజేపీ నేత బాలేశ్ ధన్కర్కు ఆస్ట్రేలియా కోర్టు 40 ఏండ్ల జైలు శిక్ష విధించింది. కొరియన్-ఇంగ్లిష్ అనువాదకుల ఉద్యోగాలు ఉన్నాయని మోసపూరితంగా ప్రకటనలు ఇచ్చి, ఐదుగురు కొరియన్ మహిళలపై ఆయన అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో శుక్రవారం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ధన్కర్ బాధిత మహిళలకు మత్తు మందులు ఇచ్చి వారిపై లైంగిక దాడి చేశాడని… ఆ దృశ్యాలను చిత్రీకరించాడని కోర్టు 2023 ఏప్రిల్‌లో తీర్పు చెప్పింది. ఆయనకు 30 ఏండ్ల పాటు పెరోల్ మంజూరు చేయరాదని జడ్జి ఆదేశించారు. ధన్కర్ బీజేపీ ఓవర్సీస్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన ఆస్ట్రేలియా విభాగాన్ని స్థాపించారు. ఇది బీజేపీకి అధికారిక మద్దతుదారు. ధన్కర్ 2006లో చదువు కోవడం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లారు.