బ్లూమింగ్టన్: మనిషిలో ఆందోళనను(యాైంగ్జెటీ) గుర్తించే రక్తపరీక్షను ఇండియానా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ద్వారా ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారా ?, భవిష్యత్తులో ముప్పు పెరగనుందా ?, ఆందోళన ఉన్న వారికి చికిత్స చేయడానికి ఉత్తమమైన థెరఫీ ఏది? వంటి అంశాలను కూడా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. దీనిని వైద్యుల వినియోగానికి మైండ్ఎక్స్ సైన్సెస్ అనే సంస్థ ఉత్పత్తి చేయనుంది.