శాన్ఫ్రాన్సిస్కో, జూలై 28: టెస్లా ఆటో పైలట్ సిస్టమ్ డ్రైవింగ్‌కు మరొకరు బలయ్యారు. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఆటోపైలెట్ మోడ్‌లో నడుస్తున్న కారు ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టింది. వాహనదారుడు అక్కడికక్కడే మరణించాడు. సౌత్బౌండ్లో ఆదివారం ఈ ప్రమాదం జరిగినట్టు ఉటా హైవే పెట్రోలింగ్ బృందం తెలిపింది.
ఇదే తరహాలో 48 వాహన యాక్సిడెంట్ల కేసులు దర్యాప్తులో ఉండగా.. అందు లో 39 కేసులు టెస్లా వాహనాలవేనని వెల్లడించింది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అంశంపై అమెరికా దర్యాప్తు జరుపుతున్నది.