రష్యాకు వార్నింగ్ ఇచ్చిన బైడెన్

లండన్: తొలి విదేశీ పర్యటన మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. శత్రు దేశం రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ రష్యా ఏదైనా హానికర కార్యకలాపాలకు పాల్పడితే, అప్పుడు ఆ దేశం దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్ అన్నారు. మిత్రదేశాలతో బంధాల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వినిపించారు. బుధవారమే బ్రిటన్ చేరుకున్న బైడెన్.. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కలవనున్నారు. యూరోప్ దేశాల్లో మొత్తం 8 రోజుల పాటు బైడెన్ పర్యటించనున్నారు. విండర్స్ క్యాసిల్‌లో ఆయన క్వీన్ ఎలిజబెత్‌ను కలవనున్నారు. జీ7 నేతల సమావేశానికి కూడా హాజరుకానున్నారు. అధ్యక్ష హోదాలో తొలి నాటో సమావేశంలో పాల్గొంటారు. ఇక జెనీవాలో జరిగే ఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ జో బైడెన్ భేటీకానున్నారు. రష్యాకు సంబంధించిన ఆయుధ నియంత్రణ, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌లో రష్యా జోక్యం, సైబర్ హ్యాకింగ్, నవాల్నీ జైలు శిక్ష లాంటి అంశాలపై బైడెన్ వత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

