బీజింగ్: చైనా అమ్మాయిలు కృత్రిమ మేధ (ఏఐ) బాయ్‌ఫ్రెండ్స్ వెంటపడుతున్నారు. సామాన్య బాయ్‌ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు కసురుకుంటారని, ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ అయితే నిరంతరం తమకు వెన్నుదన్నుగా ఉంటారని చెప్తున్నారు. రొమాంటిక్ సంభాషణలకైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అంటున్నారు.
వీరంతా ‘గ్లో’ అనే చాట్‌బాట్‌ను డౌన్లోడ్ చేసుకుని తమకు నచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ను ఎంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. పాప్ స్టార్స్, యుద్ధ వీరులు, సీఈఓలు వంటి అనేక క్యారక్టర్స్ ఈ యాప్‌లో ఉన్నాయి. వయసు, గుర్తింపు, అలవాట్లు, పాటించే విలువలు వంటి ఆధారంగా ఈ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.