గాజా: ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవావ్ గ్యాలెంట్పై వేటు పడింది. ఆయన్ను తొలగిస్తూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ ఆదేశాలు జారీ చేశారు. హమాస్, హిజ్బొల్లాపై జరుగుతున్న యుద్ధంలో జాప్యం చోటుచేసుకుంటున్నట్లు నెతన్యహూ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి కట్జ్కు .. రక్షణ శాఖను అప్పగించారు. ఇక విదేశాంగ శాఖను గిడియాన్ సార్‌కు అందజేయనున్నారు. హమాస్, హిజ్బొల్లాపై జరుగుతున్న పోరుపై.. రక్షణ మంత్రి గ్యాలెంట్ , తన మధ్య విభేధాలు వచ్చినట్లు నెతనహ్యూ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో ప్రభుత్వంపై నమ్మకం ఉండాలని, కానీ రక్షణ మంత్రి, తమ మధ్య నమ్మకం సడలినట్లు నెతన్యహూ తెలిపారు. ఆ గ్యాప్‌ను పూడ్చేందుకు చాలా ప్రయత్నం చేశానని, కానీ ఇంకా అగాధం పెరిగిందని, ఈ విషయాలు శత్రువులకు కూడా తెలిసినట్లు నెతనహ్యూ చెప్పారు. మంత్రి గ్యాలెంట్ను తొలగించడం ఇది రెండోసారి. మార్చి 2023లో కూడా ఓ సారి ఆయనపై వేటు వేశారు. గతంలో ఆయన న్యాయ సంస్కరణలను విమర్శించారు.