బీజింగ్: డిస్కో డ్యాన్సర్ ఫిల్మ్‌లోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా సాంగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. బప్పిలహరి స్వరపరిచిన ఆ నాటి సాంగ్ ఇప్పుడు చైనాలో మారుమోగుతోంది. కోవిడ్ వల్ల కఠిన లాక్డౌన్ పాటిస్తున్న ఆ దేశ ప్రభుత్వ తీరును ఖండిస్తూ చైనీయులు నిరసనలు చేపడుతున్నారు. ఆ నిరసనల్లో జిమ్మీ జిమ్మీ సాంగ్ ప్రతిధ్వనిస్తోంది. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనల్లో జిమ్మీ పాట మారుమోగుతోంది.
Locked down Chinese signing Jie Mi (give me rice)!#JieMi #CovidIsNotOver #GiveMeRice #JimmyJimmy#China #Lockdown #COVID19 #DiscoDancer pic.twitter.com/IFSM7LsmhV
— Durgesh Dwivedi ✍🏼 🧲🇮🇳🇺🇸🎻 (@durgeshdwivedi) October 31, 2022
చైనాలో టిక్‌టాక్‌కు బదులుగా డౌయిన్ అనే సోషల్ మీడియా యాప్ చాలా ఫేమస్. ఇప్పుడు ఆ యాప్‌లో జిమ్మీ జిమ్మీ సాంగ్‌తో నిరసనకారులు వీడియోలు పోస్టు చేస్తున్నారు. కానీ మాండరిన్ భాషలో జిమ్మీ జిమ్మీ సాంగ్ సాగుతుంది. ఆ భాషలో జీ మీ.. జీ మీ అన్నట్లుగా పాటు ఉంటుంది. భోజనం పెట్టండి అని మాండరిన్లో దాని అర్థం. కఠిన లాక్డౌన్ వల్ల నిత్యావసర ఆహార పదార్ధాలు దొరకడం లేదని చైనీయులు పాట రూపంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి చైనాలో సోషల్ మీడియాపై విపరీతమైన ఆంక్షలు ఉంటాయి. కానీ వైరల్‌గా మారుతున్న జిమ్మీ జిమ్మీ సాంగ్‌ను మాత్రం చైనా కట్టడిచేయలేకపోతోంది. ప్రజా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు అక్కడ ప్రజలు బాలీవుడ్ పాటను ఎంచుకున్న తీరు హైలెట్. లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారు. ఆ ఘటనలకు చెందిన వీడియోలు చైనాలో వైరల్ అవుతున్నాయి.